![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది..ఈ షోకి "ఊరి పేరు భైరవకోన" మూవీ నుంచి సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ వచ్చి ఈ ఎపిసోడ్ లో ఒక టాస్క్ కూడా ఆడి గెలిచారు. ఇక ఈ షోలో నాగపంచమి సీరియల్ టీమ్ అలాగే మామగారు సీరియల్ టీమ్ వచ్చారు. వీళ్ళతో కొన్ని గేమ్స్ ఆడించింది. ఐతే నాగ పంచమి సీరియల్ హీరోహీరోయిన్ పంచమి, మోక్షతో హోస్ట్ శ్రీముఖి ఒక టాస్క్ ఆడించింది. వీళ్ళు లవర్స్ వాళ్ళే చెప్పేలా శ్రీముఖి, అవినాష్ ట్రై చేసారు. వీళ్ళిద్దరితో ఒక లవ్ గేమ్ ఆడించారు. వీళ్లకు ఒక క్వశ్చనైర్ కూడా ఇచ్చింది శ్రీముఖి. మోక్ష మొబైల్ లో పంచమి పేరు "కుల్లమ్మా" అని ఫీడ్ చేసుకున్నాడు.
అలాగే పంచమి నవ్వు అంటే ఇష్టం అని, సీరియల్ మంచి కోయాక్టర్స్, ఫ్రెండ్స్ అని, పంచమిలో అన్నీ నచ్చే విషయాలే అని నచ్చని విషయం ఒక్కటి కూడా లేదని అలాగే పంచమిని ముద్దుగా కుల్లమ్మా అని పిలుస్తానని చెప్పాడు. ఇక పంచమికి మోక్ష గురించిన ఇవే ప్రశ్నలు ఇచ్చింది శ్రీముఖి..పంచమి మొబైల్ లో మోక్ష పేరు "క్లోజప్" అని ఉంటుంది. అలాగే మోక్షలో చిందరవందరగా ఉండే జుట్టంటే ఇష్టం అని అతనిలో నచ్చని విషయం అంటూ ఏదీ లేదని, ఇద్దరూ గుడ్ ఫ్రెండ్స్ అని అలాగే లాస్ట్ మెసేజ్ గా ఐస్ క్రీం ఆర్డర్ చెయ్యమని చెప్పానని చెప్పింది పంచమి. ఇక శ్రీముఖి, అవినాష్ కలిసి వీళ్ళిద్దరూ మొబైల్స్ తీసుకుని చాటింగ్ అది మోక్ష, పంచమి చాట్ చేసుకున్నట్టు. ఆ అమ్మాయి ఐస్ క్రీం కావాలి అని మెసేజ్ చేస్తే ఐ లవ్ యు అని మోక్ష రిప్లై ఇచ్చాడు..తర్వాత లవ్ యు టూ అని పంపించింది, ఐ కిస్ యు, కిస్ యు టూ, ప్లీజ్ మ్యారి మీ అంటే యా అని మెసేజ్ చేసాడని చూపించింది శ్రీముఖి. కన్నడలో కుల్లమ్మ అంటే తెలుగులో పొట్టి పిల్లా అని అలా తనకు ముద్దుగా పిలుచుకోవడం అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక వీళ్ళ ప్రేమ నిజమైనదే అంటూ ఫుల్ మార్క్స్ ఇచ్చింది శ్రీముఖి. ఇలా ఈ వారం షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.
![]() |
![]() |